- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి వెళ్లడం లేదు : ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా వెళ్లడం లేదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన నెల్లూరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వైఖరితోనే స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్ జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని హెచ్చిరించారు. తనను వైసీపీ నుంచి బహిష్కరించినా.. ఎమ్మెల్యేగా తనను ఎవరూ తొలగించలేరని అన్నారు. తన నయోజకవర్గ అభివృద్ధి కోసం సీఎ జగన్‌ను అనేక మార్లు కలిశానని, వినతిపత్రాలకు కూడా అందజేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై చేసిన ఆరోపణలను ఎవరూ ఎవరూ నిరూపించలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేసి తీరుతానని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.