విశాఖ రైల్వే జోన్ ఆలస్యంపై అసలు విషయం బయటపెట్టిన కేంద్రమంత్రి

by srinivas |
విశాఖ రైల్వే జోన్ ఆలస్యంపై అసలు విషయం బయటపెట్టిన కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రైల్వే జోన్ ఆలస్యంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ పునర్యవవస్థీకరణలో భాగంగా ఇచ్చిన ప్రధాన హామీల్లో ఏపీకి రైల్వే జోన్ ఒకటి. అయితే రైల్వే జోన్‌పై ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పటివరకూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీనంతటికీ కేంద్రప్రభుత్వమే కారణమని అంతా భావించారు. అయితే తాము కాదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభ సభ సాక్షిగా చెప్పేశారు. అంతేకాదు అసలు కారణమేంటో కూడా చెప్పారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వలేదని రైల్వే శాఖ మంత్రి స్పష్టం చేశారు.

రైల్వే జోన్‌పై లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బదులిచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కావాల్సిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు ఇప్పటికే రెడీ అయిందని తెలిపారు. రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి రూ.106.89 కోట్ల అంచనా వ్యయం కూడా మంజూరు చేశామని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించామని తెలిపారు. భూ సర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్సియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు అప్పగించామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ముడసర్లోవలోని 52.2 ఎకరాల భూమిలో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించాలని డీపీఆర్ కూడా ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న రైల్వే భూమికి బందులుగా ముడసర్లోవలో 52.2 ఎకరాల భూమిని రైల్వేకు జీవీఎంసీ అప్పగించాల్సి ఉందని, అయితే అందుకు అనువైన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ రైల్వే శాఖకు అప్పగించలేదని, అందువల్లే జోన్ లేట్ అవుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed