CBI: ఇవాళ్టికి ముగిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ

by srinivas |   ( Updated:2023-04-19 16:27:23.0  )
CBI: ఇవాళ్టికి ముగిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నేటి సీబీఐ విచారణ ముగిసింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే నాలుగుసార్లు విచారించిన సీబీఐ అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 25 వరకూ కూడా విచారించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీబీఐ ఎదుట విచారణకు హాజరయిన ఆయనను అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారించారు. విచారణ సమయంలో ఆడియో, వీడియోను సైతం రికార్డు చేశారు.

వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించిన సీబీఐ

ఇక వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులుగా రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారుల విచారించారు. నాంపల్లి సీబీఐ స్పెషల్ కోర్టు వీరిని కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలు నుంచి నేరుగా సీబీఐ కార్యాలయానికి తరలించి విచారించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా విచారించారు. ముందుగా వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ ముగిసింది. అనంతరం రెండు గంటల తర్వాత అవినాశ్ రెడ్డి విచారణ కూడా ముగిసింది.

ఇవి కూడా చదవండి: CBI: భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి ముగిసిన విచారణ... అవినాశ్‌రెడ్డికి కంటిన్యూ

Advertisement

Next Story

Most Viewed