- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్.. విదేశీ పర్యటనకు CBI కోర్టు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు భారీ ఊరట కల్పించింది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 17 నుండి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నంబర్, జీ మెయిల్ వివరాలు కోర్టుకు సీబీఐకి ఇవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా ఇవాళ పై తీర్పు వెలువరించింది.