Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్

by Rani Yarlagadda |
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి షాక్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి ఊహించని షాక్ తగిలింది. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ (Vizag Three Town Police Station)లో ఆయనపై కేసు నమోదైంది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్ లపై సోషల్ మీడియాలో దుర్భాలాడుతూ పోస్టులు పెట్టారని అంజనప్రియ అనే మహిళ నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక మహిళగా ఆ మాటలను తాను భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల (AU Law College) విద్యార్థిని అంజనప్రియ నిన్న రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story