- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు: తాడేపల్లికి ఐదుగురు ఎమ్మెల్యేలు
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇన్‌చార్జిల మార్పు, ఇన్‌చార్జిల స్థాన చలనం కూడా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది ఇన్‌చార్జిల మార్పులు చేర్పులు చేస్తూ ఓ జాబితా విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ మరో రెండు లిస్ట్‌లు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సెకండ్ లిస్ట్ రాబోతుంది. ఈ లిస్ట్‌లో ఉభయగోదావరి, రాయలసీమకు సంబంధించి పలు అభ్యర్థుల జాతకాలు బయటపడనున్నట్లు తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇందులో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో ఇరువురు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వీరితోపాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.