BREAKING: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ.. కేడర్‌లో టెన్షన్.. టెన్షన్

by Shiva |   ( Updated:2024-02-21 06:30:34.0  )
BREAKING: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ.. కేడర్‌లో టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ జంపింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ‌లో సీటు ఆశించి భంగపడిన అభ్యర్థులు వైసీపీలోకి, వైసీపీలో తమకు తగిన గౌరవం దక్కడం లేదని కొందరు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. మరో వైపు ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థులు ఎంపికపై దృష్టి పెట్టారు. ఎవరిని ఎక్కడ పోటీలో నిలపాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ఎంపికలో కాస్త వెనుకపడ్డారు. జనేసేనతో పొత్తు ఉండటంతో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎంపికపై ఇంకా ఏకాభిప్రాయానికి రావడం లేదు. దీంతో అభ్యర్థులు ఎంపిక మందకొడిగా సాగుతోంది. మరోవైపు సీఎం జగన్ జెట్ స్పీడ్‌లో అభ్యర్థులను మారుస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి, ప్రైవేటు ఏజెన్సీలతో సర్వేలు చేయించి ప్రజాదరణ ఉన్న నాయకులను నియోజకవర్గ ఇంచార్జీలుగా నియమిస్తూ ఎన్నికల కదనరంగంలోకి దిగేశారు. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నాయకుల్లో నైరాశ్యం నెలకొంది.

పార్టీలో సినీయర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. నెల్లూరు లోక్‌సభ ఇంచార్జీగా ఆయనకే బాధ్యతలను కట్టబెట్టినా.. నెల్లూరు సిటీ ఇంచార్జీ ఎంపికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని బాహాటంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళో, రేపో వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన తరువాతే వేమిరెడ్డి తుది ప్రకటన చేస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed