ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటన.. వైసీపీపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-09 10:01:32.0  )
ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటన.. వైసీపీపై మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమదు చేసుకుని ఇద్దరు బోటు యజమానులైన రామ్మోహన్, ఉషాద్రిని అరెస్ట్ విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ప్రకాశం బ్యారేజీని కావాలనే దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పక్కాగా ప్లాన్‌ను అమలు చేశారని ఫైర్ అయ్యారు. కుట్రలతో ఎంతకైనా తెగించే హీన చరిత్ర వైసీపీకి ఉందని ధ్వజమెత్తారు. బోటు ప్రమాదంపై దర్యాప్తులో త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.

కాగా, AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లు గల బోట్లు..ఇటీవల ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, బోట్లు తమవేనని ఎవరూ రాకపోవడంతో అధికారులకు అనుమానాలను కలిగాయి. ప్రాథమిక విచారణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల బోట్లుగా తేలింది. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేశ్ అనుచరులు ఉషాద్రి, రామ్మోహన్‌కు చెందిన బోట్లనే వినియోగించారని నిర్ధారించారు. దీంతో విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed