Breaking news: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..!

by Kavitha |   ( Updated:2024-09-04 14:58:05.0  )
Breaking news: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా ఏపీ(Andhrapradesh) రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఈ రోజు కూడా ఏపీలోనీ తూర్పు గోదావరి జిల్లాలోని(East Godavari District) ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. అదే విధంగా గుంటూరులోనూ(Guntur District) ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలకు కూడా హాలిడే ఇచ్చారు. అయితే అంతకు ముందు ఎన్టీఆర్( NTR District) జిల్లాల్లో సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

Next Story

Most Viewed