- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్.. స్పీకర్ అయ్యన్నకు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదాను కల్పించాలని కోరుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు పెట్టాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌పై తదుపరి విచారణను మరో మూడు వారాలకు వాయిదా వేశారు.
కాగా, అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి తరువాత ప్రతిపక్ష నేతతో ప్రమాణస్వీకారం చేయించడం ఆనవాయితీ అని లేఖలో పేర్కొన్నారు. సంప్రదాయాలకు తుంగలో తొక్కుతూ మంత్రుల తరువాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణం చేయించడం సరైంది కాదని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని ముందే నిర్ణయించారా అని లేఖ ద్వారా ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని జగన్ తెలిపారు.