BREAKING: 62 వేల మంది వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించొద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

by Shiva |
BREAKING: 62 వేల మంది వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించొద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు ముగిసేంత వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వానికి ఆదేశించాలని బీసీవై పార్టీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో నేటి వరకు 62 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు.

వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది తెలిపారు. రాజీనామాలు ఆమోదిస్తే.. వైసీపీకి అనుకూలంగా ఉంటారని పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 324 ప్రకారం విస్త్రృత అధికారాలు ఉన్నాయని.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆధికారాలు వినియోగించవచ్చని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాల వరకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed