- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: రాజకీయాలకు చిరంజీవి అన్‌ఫిట్: పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ దగ్గరపడుతున్నా కొద్ది రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు చిరంజీవి అన్‌ఫిట్ అంటూ కామెంట్ చేశారు. చిరంజీవికి రెండు రాష్ట్రాల ప్రజలపై అసలు ప్రేమే లేదని ధ్వజమెత్తారు. ప్రజాసేవ అంటూ పార్టీని పెట్టి జెండా పీకేశాండంటూ ఫైర్ అయ్యారు. సినిమాలాగే రాజకీయాన్ని కూడా చిరంజీవి ఓ బిజినెస్‌లా చూశారని ఆరోపించారు. ఆయన పార్టీ తరఫున గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలను నిర్ధాక్షిన్యంగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి.. అందులోనే విలీనం చేసిన విషయం జనం మరువలేదని అన్నారు. ప్రజలకు వెన్నుపోటు పోడిచిన చిరంజీవికి ఓటు అడిగే హక్కు, అర్హత లేదని పోసాని అన్నారు. అదేవిధంగా చంద్రబాబు అధికారంలో ఉంటే ఎప్పుడూ రెవెన్యూ లోటు ఉంటుందన్నారు. ఆయన 14 ఏళ్ల పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని పోసాని ప్రశ్నించారు.