BREAKING: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వారికి పెన్షన్లు కట్!

by Shiva |   ( Updated:2024-08-21 03:11:11.0  )
BREAKING: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వారికి పెన్షన్లు కట్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకుంటున్న లబ్దిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటుండగా.. దివ్యాంగుల కోట కింద సుమారు 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. అందులో చాలామంది అనర్హులు ఫేక్ సర్టిఫికెట్లను పెట్టి పెన్షన్ తీసుకుంటున్నట్లుగా గుర్తించి వారికి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. 8 లక్షల మందిలో సుమారు 60 మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి తినిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఎవరైనా నకిలీ సర్టిఫికెట్లతో పెన్షన్‌‌కు దరఖాస్తు చేసుకుంటే ప్రాథమికంగా ఆ దరఖాస్తులను పక్కకు పెట్టాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed