- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: రాష్ట్రంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు అందరిని కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదాన్ని మరువక ముందే అదే జిల్లాలోని పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గెడియంట్స్ కంపెనీలో అర్థరాత్రి 12.30కి రసయనాలు మిక్స్ చేస్తుండగా ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు కార్మికులు కార్మికులకు గాయాలు కాగా, అందలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పాట్‌కు వెళ్లి తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. అవసరం అయితే ఎయిర్ అంబులెన్స్‌లు వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు.