- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమన్వయ లోపం.. భక్తులకు శాపం
దిశ, తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇటీవల జరిగిన అవాంఛనీయ ఘటనలు భక్తులను కలవరపెడుతున్నాయి. ప్రధాన ఉత్సవాలు, రద్దీ రోజుల్లో భక్తులకు భయాందోళన కలిగిస్తున్నాయి. మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అధికారుల సమన్వయలోపం దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మంత్రుల ముందే భక్తుల నిరసన
మూడు నెలల క్రితం సంపూర్ణ చంద్ర గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీశ్వరాయంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకునేందకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అదే సమయంలో వ్యతిరేక దిశలో పలువురు అడ్డదారి దర్శనాలకు చొరబడటంతో స్వామి వారి సన్నిధి వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గ్రహణ దర్శనం చేసుకునేందుకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే భక్తుల మధ్య కుమ్ములాట జరగడం అప్పట్లో దుమారం రేగింది.గత ఏడాది ఏప్రిల్ నెలలో వేసవి సెలవులు కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శనానికి వచ్చారనే కారణంతో అధికారులు, పాలకమండలి మధ్య సమన్వయం లేకుండా క్యూలైన్లను బ్లాక్ చేశారు. దీంతో క్యూలైన్లలో అప్పటికే నిరీక్షించి విసుగెత్తిన భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటన సంచలనం రేకెత్తించింది.
మంటపానికి మంటలు
గత ఏడాది డిసెంబరు 5న తమిళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలోని మహానంది వద్ద చుక్కాని ఉత్సవం నిర్వహించారు.భక్తులు పెద్దసంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ ఆలయ అధికారులు ముందస్తుగా పోలీసు బందోబస్తు కూడా తీసుకోలేదు.పలుకుబడి ఉన్నవారంతా చుక్కాని దగ్గరకు చేరిపోయారు. చుక్కానికి నిప్పంటించిన వెంటనే ఒకసారిగా మంటలతో తాటిమట్టలు భక్తులపైకి విరజిమ్మాయి. భక్తులు పరుగులు తీసే సమయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళా సెక్యూరిటీ గార్డు చేయి విరగడంతో తీవ్రంగా గాయపడింది. ఇందులో భాగంగా అప్పటిలోనే చుక్కాని సమీపంలోని మంటలు రూ.750 రాహుకేతు మండపంపై ఎగసిపడటంతో సీసీ కెమెరా కేబుళ్లకు వ్యాపించాయి. ఈ ఘటనలో పెనుప్రమాదం తృటిలో తప్పింది. ఇలా రద్దీ రోజుల్లో తరచూ అవాంఛనీయ ఘటనలు జరగడం షరామాములుగా మారిపోయింది.
ఈ సారైనా కళ్లు తెరుస్తారా ?
ఇక 13నుంచి 26వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు రెండు దఫాలు సమన్వయ సమావేశం నిర్వహించారు. కానీ సమన్వయం మాత్రం ఇంకా కనబడటం లేదు. ఈ నెల 5వ తేదీన స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం జరిగింది. త్రిశూల స్నానం వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ముందస్తుగా పోలీసుశాఖ బందోబస్తు కోరలేదు.ఆలయ సెక్యూరిటీ గార్డులు త్రిశూల స్నానంలో భక్తుల రద్దీని కట్టడి చేయలేకపోయారు. నది ప్రదేశం విస్తారంగా ఉన్నప్పటికీ భక్తుల మధ్య స్వల్ప తోపులాటలు జరిగింది. మహాశివరాత్రి మరుసటి రోజు రథోత్సవం, అదే రోజు తెప్పోత్సవం సందర్భంగా భక్తులు పట్టణ వ్యాప్తంగా కిక్కిరిసిపోతారు. ముఖ్యంగా మహా శివరాత్రి రోజున ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలంటే ముందస్తు అప్రమత్తత చాలా అవసరం.గత ఏడాది పోలీసుశాఖ మహా శివరాత్రి రోజున ఆలయంలో భద్రతను కట్టుదిట్టంగా అమలు చేశారు. కానీ కొందరు పోలీసు సిబ్బంది తమకు అయిన వారిని మాత్రం యథేచ్చగా అడ్డదారిలో దర్శనాలకు తీసుకెళ్లడంతో క్యూలైన్లలో గందరగోళం ఏర్పడింది. కరోనా కారణంగా గత ఏడాది 14 రోజుల జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖులు ఎవరూ పాల్గొనలేదు. అయితే ఈ సారి ప్రతి రోజూ దేశ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. గత అనుభవాల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, పాలకమండలి సభ్యులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉంది.