- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బూమ్ బూమ్ బాబుదే.. ఇదే సాక్ష్యం..
దిశ వెబ్ డెస్క్: నేడు వైసీపీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో మద్యపానం ఎక్కువైందని.. అలానే కల్తీ లిక్కర్ అమ్మి ప్రజల ప్రాణాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన స్పందిచారు. కొంత బ్రాండ్ లు వైసీపీ తీసుకు వచ్చిందనే కొత్త కథనాలను ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయని మిథున్ మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక జగ్మోహన్ రెడ్డి ఒక్క బ్రాండ్ కు కూడా సంతకం పెట్టలేదని తెలిపారు. ఇక గతంలో వైసీపీ ప్రెసిడెంట్ మెడల్, భూమ్ భూమ్ ఇలా చాల బ్రాండ్ లను జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని చెప్పారని.. అయితే చంద్రబాబు మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆ బ్రాండ్ లను రాష్ట్రంలోకి తీసుకువచ్చింది చంద్రబాబు అని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ఏవైతే నాసిరకం బ్రాండ్ అంటుందో అవన్నీ గతంలో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన ప్రాజెక్టులు అని పేర్కొన్నారు. కావాలంటే తేదీలతో సహా చూపిస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. ఇక లిక్కర్ వ్యాపారమే పాపం..దాని జోలికి వెళ్లకూడదని తన తండ్రి తనకు నేర్పించారని మిథున్ రెడ్డి తెలిపారు.