ప్రకాశం బ్యారేజీ గేట్లకు బలంగా ఢీకొట్టిన బోట్లు.. మూడు గేట్లు ధ్వంసం..?

by Mahesh |
ప్రకాశం బ్యారేజీ గేట్లకు బలంగా ఢీకొట్టిన బోట్లు.. మూడు గేట్లు ధ్వంసం..?
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చి చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 70 గేట్లను పూర్తి స్థాయిలో పైకి ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీలో ఉండే పలు పడవలు లాక్ చైన్ తెగిపోవడంతో వరదలో కొట్టుకు వచ్చాయి. ఈ క్రమంలో వరద వేగంగా ఉండటంతో మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీ లో మూడు గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో బ్యారేజ్ డ్యామేజ్ అయింది. ఈ క్రమంలో చాలా సేపు ఆ బోట్లు గేట్ల ముందు అడ్డుపడటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. కొద్ది సేపటికి ఆ బోట్లను పక్కకు లాగినట్లు తెలుస్తుంది. అయితే బోట్లు బలంగా ఢీకొట్టిన ప్రాంతంలో బ్యారేజ్ పగుళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఎటువంటి ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతం బ్యారేజీ 70 గేట్లను ఎత్తిన అధికారులు.. దాదాపు 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed