AP:మాజీ మంత్రి ఆర్కే రోజాకి బిగ్ షాక్..?

by Jakkula Mamatha |   ( Updated:2024-06-14 08:48:43.0  )
AP:మాజీ మంత్రి ఆర్కే రోజాకి బిగ్ షాక్..?
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ హయంలో క్రీడాశాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఆర్‌డీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశామన్నారు. వివరాల్లోకి వెళితే..గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ) కి ఫిర్యాదు చేశామని ఆర్డీ ప్రసాద్ తెలిపారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలన్నారు. ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మోడరన్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్. బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story