- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG BREAKING : గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం
దిశ, వెబ్‌డెస్క్ : గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోస్టులకు భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగింపునకు అంగీకారం తెలిపింది. అభ్యర్థుల వస్తున్న అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించింది. ఈ మేరకు జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని కోరింది. అదేవిధంగా ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది. అయితే
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇంతకు ముందు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేయగా.. అభ్యర్థుల ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తుల గడువును జనవరి 17 వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది.