Tirumala News:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..టీటీడీ కీలక ప్రకటన?

by Jakkula Mamatha |
Tirumala News:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..టీటీడీ కీలక ప్రకటన?
X

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం ఎంతో మంది భక్తులు వస్తూంటారు. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. నవంబర్ కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్ లైన్‌లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటనను తాజాగా విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నవంబర్ నెల కొటాకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ కోటా టికెట్లను ఇవాళ(ఆగస్టు 23) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనుంది.

ఈ టికెట్లతో పాటుగా నవంబర్ నెల కోటా రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆగస్టు 24(శనివారం) ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఇక ఆగష్టు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed