Heavy Rains Effect:జాగ్రత్త.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-16 11:02:59.0  )
Heavy Rains Effect:జాగ్రత్త.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను వీడడం లేదు. ఇప్పటికే గత నెలలో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విజయవాడను(Vijayawada) వరదలు(Floods) ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు(Flash floods) సంభవించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. లోతట్టు, పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రకాశంలో 4, నెల్లూరులో 6, అన్నమయ్య జిల్లాలోని 3 మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం వాయుగుండం నెల్లూరుకు 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed