ఎన్నికలకు ముందే వైసీపీ ఖాళీ..టీడీపీ లోకి భారీగా చేరికలు

by Jakkula Mamatha |   ( Updated:2024-03-21 14:32:23.0  )
ఎన్నికలకు ముందే వైసీపీ ఖాళీ..టీడీపీ లోకి భారీగా చేరికలు
X

దిశ,అమలాపురం:సార్వత్రిక ఎన్నికలకు ముందే ముమ్మిడివరం నియోజకవర్గంలో వైసీపీ ఖాతా ఖాళీ అవుతోందని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటు ఇన్చార్జి హరీష్ బాలయోగి అన్నారు.టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన పట్టణంలోని తాడి నరసింహారావు నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పల్లవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబాలు మూకుమ్మడిగా టీడీపీలో చేరాయి.వారందరికీ హరీష్ బాలయోగి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ..వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనకు చేరికలే నిదర్శనమని తెలిపారు. టీడీపీలో చేరిన వారంతా సీనియర్ నాయకుల సమన్వయంతో పని చేయాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పై గడపగడపకు వెళ్లి, ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More..

వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. పిల్లలపై ప్రమాణం చేస్తా: బోడె ప్రసాద్


Next Story