- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజాపై బండారు వ్యాఖ్యలు : నటి ఖుష్బూ వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ఆర్‌కే రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి ఆర్‌కే రోజా ఈ వ్యాఖ్యలపట్ల కన్నీటి పర్యంతం చేశారు. రోజాపై వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోజాను ట్రోల్ చేశారు. గతంలో నువ్వు మాట్లాడిందేమిటి అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఖండించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు.అసలు బండారు సత్యనారాయణమూర్తి ఒక మనిషిగా కూడా ఫెయిల్ అయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండారు సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి అసలు మనిషేనా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజాపై మాజీ మంత్రి బండారు జుగుప్పాకరంగా ఉన్నాయన్నారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించేవారెవరూ బండారు సత్యనారాయణ మూర్తిలా నోరు పారేసుకోరని సినీనటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాకు బండారు సత్యనారాయణ మూర్తి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇకపోతే ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు నందమూరి, నారా కుటుంబాలపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు. రోజా గురించి తాము మాట్లాడితే ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆర్‌కే రోజా నీలి చిత్రాల్లో నటించారని ఆ వీడియోలు బయటపెడితే పరిస్థితి ఏంటని నిలదీశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై గుంటూరులోని నగరం పాలెం పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు ఆయనను నర్సీపట్నం నుంచి అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లారు. అనంతరం బండారుకు బెయిల్ మంజూరు అయ్యింది.