Pv Sindu Marriage: పవన్ కల్యాణ్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

by srinivas |
Pv Sindu Marriage: పవన్ కల్యాణ్‌కు ఆహ్వాన పత్రిక అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(Badminton player PV Sindhu) కలిశారు. మంగళగిరి (Mangalagiri)క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె.. తన మ్యారేజ్‌కు రావాలని ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 22న తన పెళ్లి ఉదయ్ పూర్‌(Udaipur)లో జరగబోతోందని, కుటుంబ సమేతంగా అందరూ రావాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా పీవీ సింధుతో పాటు ఆమె తండ్రి పి.వి. రమణతోనూ పవన్ కల్యాణ్ ముచ్చటించారు.

కాగా పీవీ సింధుకు వివాహం నిశ్చయమైంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయితో ఈ నెల 22న ఆమె పెళ్లి జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ఈ జంట పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం ఘనంగా చేసుకున్నారు. కాబోయే దంపతులిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 20వ తేదీ నుంచి హైదరాబాద్‌లో పీవీ సింధు పెళ్లి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 24న విందు కార్యక్రమం ఉంటుందని పీవీ సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed