- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ అభిమాని నారాయణపై దాడి వైసీపీ సైకోల పనే: నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అభిమాని నారాయణపై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ.. నారా భువనేశ్వరికి సంఘీభావంగా నారాయణ పాదయాత్ర చేస్తున్నారు. నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకు బాబుతో నేను అంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే గురువారం నారాయణపై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘జగన్ సైకోయిజం వైసీపీ కార్యకర్తలకీ అంటుకుంది. రాజ్యాంగవ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతూ, ప్రశ్నించే ప్రతిపక్షనేతల్నే కాకుండా ప్రజల్ని కూడా హింసిస్తూ సైకో జగన్ తన శాడిజం చూపిస్తున్నాడు. అధినేత చూపిన ఫ్యాక్షన్ బాటలో వైసీపీ కేడర్ పయనిస్తూ సామాన్యులని భయభ్రాంతులకి గురిచేస్తున్నారు’ అని ఆరోపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ శాంతియుత పోరాటం చేస్తున్న భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల నుంచి రాజమహేంద్రవరం వరకూ పాదయాత్రగా వెళ్తోన్న నారాయణ అనే టీడీపీ అభిమానిపై దాడి అమానవీయం అని లోకేశ్ అన్నారు. వృద్ధుడు అని చూడకుండా దాడి చేశారంటే వీరు ముమ్మాటికీ వైసీపీ సైకోలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.