దారుణం : సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

by Seetharam |   ( Updated:2023-09-07 06:52:51.0  )
దారుణం : సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరులో దారుణం జరిగింది. పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మిగిలిన ఉద్యోగులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రమౌళి నగర్ ప్రాంతానికి చెందిన సచివాలయం ఉద్యోగి మురళీకృష్ణ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయానని గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ పై మురళీకృష్ణకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మురళీ కృష్ణ ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణం పని ఒత్తిడిలేనని తెలుస్తోంది. ఇటీవల తన సన్నిహితుల వద్ద కూడా ఇంత ప్రెషర్ తాను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన చెందినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story