ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా?: సీపీఐ నేతల అరెస్ట్‌పై కే రామకృష్ణ

by Seetharam |
cpi ramakrishna
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో సీపీఐ నేతల ముందస్తు అరెస్ట్‌లపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మండిపడ్డారు. సీపీఐ నేతల అరెస్ట్‌ను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడు తదితరుల ముందస్తు అరెస్టులు దుర్మార్గం అని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోంది. తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విపరీత చర్యలను ఖండించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కోరారు.

Advertisement

Next Story

Most Viewed