- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మూడు చోట్ల వైసీపీ గెలుపు ఆశలు గల్లంతేనా?
దిశ,వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఘోర పరాజయం తథ్యమని ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కూడా జగన్ పార్టీ ఓటమి దిశ గానే నడుస్తోందని గుసగుసలాడుతున్నారు. ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను గుర్తించిన జగన్ దానిని సాధ్యమైనంత తగ్గించాలన్న ఉద్దేశంతో చేసిన సిట్టింగుల మార్పు, పార్టీకి మరింత చేటు చేసిందని జిల్లా పార్టీ నేతలు అంటున్నారు. ప్రజెంట్ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే జగన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
మేడిశెట్టి వేణుగోపాల్, సుధాకర్ బాబు, మహీధర్ రెడ్డిలు ఈ ముగ్గురు కూడా చివరి క్షణం వరకు తమకు తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తారని ఆశించారు. కానీ పార్టీ ప్రకటించిన జాబితాలో తమకు సీటు కేటాయించక పోవడంతో రగిలిపోతున్నారు. మేడిశెట్టి వేణుగోపాల్ తన సీటు మారిస్తే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే దానికి జగన్ పూర్తిగా నిరాకరించడంతో పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఒంగోలు నియోజకవర్గం డిప్యూటీ కో ఆర్డినేటర్ పదవి ఇస్తామని చెప్పారు. కానీ ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారు వైసీపీని వీడీ టీడీపీ, జనసేన గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వారి నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
Read More..