- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: ఢిల్లీ వేదికగా ఆందోళనలకు సిద్ధమైన APCC చీఫ్.. అజెండా ఇదే ..?
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వైఎస్ షర్మిల జోష్ పెంచింది. జిల్లాలవారీగా పర్యటిస్తూ ప్రజాక్షేత్రంలో పార్టీని ముందకు తీసుకువెళ్తోంది. రానున్న ఎన్నికల్లో అన్నను గద్దె దింపి తాను అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా పర్యటించిన షర్మిల నేడు రాష్ట్ర రాజధాని కోసం దేశ రాజధాని నగరంలో ఆందోళన చేపట్టనున్నారు.
కాగా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని నిలదీయాలని షర్మిల పిలుపునివ్వనున్నారు.ఇందుకోసం ఆమె పలు పార్టీల మద్దతును కూడా గట్టుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేథ్యంలో రోజు ఉదయం షర్మిలా రెడ్డి పలు రాజకీయ పార్టీల ఎంపీలను కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని వినతి పత్రాలు ఇవ్వనున్నారు.
ఇక ఈ రోజు ఉదయం 9.30 గంటలకు NCP అధినేత శరద్ పవార్ తో వైఎస్ షర్మిల భేటీ కానున్నారు. ఆయనతో ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. అనంతరం ఉదయం 10.30గంటలకు DMK ఎంపి తిరుచి శివ తో షర్మిల భేటీ అవుతారు. ఎంపి తిరుచి శివ తో మాటామంతి మాట్లాడిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి విషయం చెప్పనున్నారు.
ఇక మధ్యాహ్నం 2 గంటలకు ఏపి భవన్ వద్ద వైఎస్ షర్మిల ధర్నా చేపట్టనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే తో షర్మిల భేటీ అయ్యే అవకాశం ఉంది.