AP: ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌‌‌కు చుక్కెదురు.. ఏపీ సీఈవో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

by Shiva |   ( Updated:2024-03-20 11:08:03.0  )
AP: ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌‌‌కు చుక్కెదురు.. ఏపీ సీఈవో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రస్తుతం కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉన్నతాధికారులతో ఇవాళ అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బ్యానర్లు, పోస్టర్లు తొలగించే ప్రక్రియ పూర్తైందని అన్నారు. ఎన్నికల్లో అధికారులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ముఖ్యంగా మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించనట్లుగా ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఎన్నికల విధుల్లో ఉండి నిబంధనలు అతిక్రమించిన 46 మంది వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫిర్యాదుల్లో 75 శాతం పరిష్కారం చేశామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయిన వారి కార్యక్రమాలకు సంబంధించి పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. డీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే విద్యాశాఖ వివరణ కోరామని, అదే అంశంపై త్వరలో సీఈసీకి లేఖ రాస్తామని తెలిపారు. ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉందని ప్రశ్నించగా.. అందుకు ఆయన సమాధానమిచ్చారు. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా ట్రైలర్ తాను ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. ఒకవేళ ట్రైలర్‌కు పొలిటికల్ టచ్ ఉంటే.. తప్పకుండా ట్రైలర్ రిలీజ్‌కు ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గాజు గ్లాసును పబ్లిసిటీగా వాడారా లేదా అన్నదానిపై ట్రైలర్‌ను మరోసారి అధికారులు పరిశీలించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed