AP: అనపర్తి నియోజకవర్గంలో రగులుకున్న టికెట్ చిచ్చు.. బీజేపీ అభ్యర్థికి సహకరించేది లేదంటూ నల్లమిల్లి ఫైర్

by Shiva |   ( Updated:2024-03-28 07:41:06.0  )
AP: అనపర్తి నియోజకవర్గంలో రగులుకున్న టికెట్ చిచ్చు.. బీజేపీ అభ్యర్థికి సహకరించేది లేదంటూ నల్లమిల్లి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పొత్తులో భాగంగా అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాను టీడీపీకి మద్దతివ్వనని, బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పనంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశాడని, తన నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదంటూ స్పష్టం చేశారు.

అదేవిధంగా తనకు టిక్కెట్ రాకుండా వైసీపీ అడ్డుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రామవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా నల్లమిల్లి అనుచరులు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. టీడీపీ కరపత్రాలు దగ్ధం, సైకిల్ ను మంటలో వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనపర్తి నుంచి రెబల్‌గా నల్లమిల్లి పోటీ చేస్తారంటూ ఆయన అనుచరులు చెబుతుంతటం గమనార్హం. త్వరలోనే తన ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు తన భవిష‌్యత్తు కార్యాచారణ ఉంటుందని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story