AP Politics:సుజనా సుడిగాలి పర్యటన

by Jakkula Mamatha |
AP Politics:సుజనా సుడిగాలి పర్యటన
X

దిశ ప్రతినిధి,విజయవాడ:ఎన్నికల సమరం తుది అంకంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి స్పీడ్‌కు వైసీపీ బెంబేలెత్తుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను, కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు.

బైక్ డ్రైవ్ చేసిన సుజనా

ప్రచారంలో భాగంగా స్వాతి థియేటర్ రోడ్ లో బైక్ డ్రైవ్ చేశారు. యువతలో ఉత్సాహాన్ని నింపారు. మొదటిసారిగా ఓటు వేసే యువత సరైన నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపు ఇచ్చారు. ఓటును దుర్వినియోగ పరచకుండా సమర్థత సామర్థ్యం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి అని సూచించారు. యువత భవిష్యత్ కోసం కార్యాచరణ రూపొందించామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆటో డ్రైవర్‌గా సుజనా

ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు భవానీపురంలో ఓ ఆటో డ్రైవర్ తో ముచ్చటించారు సమస్యలను తెలుసుకున్నారు. ఆటో డ్రైవ్ చేసి భరోసాగా ఉంటానని అభయ మిచ్చారు. భవానిపురం లో ఆదివారం గద్దె రామ్మోహన్ రావు పార్క్ ను సందర్శించారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ నిర్వాహకులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఓపిగ్గా విన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పొట్నూరు రాము సెక్రటరీ కృష్ణారెడ్డి శివ మిత్ర బృందం పాల్గొన్నారు.

శివాలయం సెంటర్లోని భవాని టవర్స్ ను సందర్శించారు. అపార్ట్మెంట్ వాసులతో ముచ్చటించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పున్నమి ఘాట్ వద్ద గల లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ వాసులను కలుసుకున్నారు. లోటస్ లెజెండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెనుమాటి జనార్ధన్ సెక్రటరీ అమర శ్రీనివాస్ సుజనాకు ఘన స్వాగతం పలికారు. అపార్ట్మెంట్ వాసుల సమస్యలను సుజనా విన్నారు. సలహాలు సూచనలను స్వీకరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అన్ని రంగాలను జగన్ ధ్వంసం చేశారని సుజనా దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతిచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సుజనా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed