భోళా శంకర్ మూవీపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Seetharam |   ( Updated:2023-08-10 12:44:14.0  )
భోళా శంకర్ మూవీపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేశ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న భోళా శంకర్ మూవీ ఈనెల 11న దేశవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఏపీలో సందిగ్ధం నెలకొంది. భోళా శంకర్ మూవీకి సంబంధించి సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ వైసీపీ ప్రభుత్వానికి చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని పత్రాలు ఇవ్వాలని కోరింది. దీంతో టికెట్ ధరల పెంపుపై సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ అంశంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పందించారు. చిరంజీవి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచాలని తమ వద్దకు దరఖాస్తు వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే 12 అంశాలపై ప్రభుత్వం స్పష్టతను కోరిందని..కానీ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి వివరణ రాలేదని మంత్రి వేణు తెలిపారు. గతంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి అభ్యర్థన పెడితే టికెట్ రేట్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో రేట్లు పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కానీ కొందరు ఈ భోళాశంకర్ సినిమాను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నం ఇకనైనా విరమిస్తే మంచిదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ హితవు పలికారు.

Read More..

సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్

Advertisement

Next Story

Most Viewed