AP Govt.: రాష్ట్రంలోని అర్చకులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి ఆనం కీలక ప్రకటన

by Shiva |   ( Updated:2024-11-05 14:27:35.0  )
AP Govt.: రాష్ట్రంలోని అర్చకులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి ఆనం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) గుడ్ న్యూస్ చెప్పింది. రూ.50 వేల ఆదాయం ఉన్న ఆలయాల్లో అర్చకులకు చెల్లించే కనీస వేతనాన్నా రూ.15 వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్ణయం తీసుకున్నారని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Ramanarayana Reddy) ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,203 మంది అర్చకులు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా దేవాదాయ శాఖకు రు.10 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. అందులో కొంత మొత్తాన్ని సీజీఎఫ్ (CGF) నిధుల నుంచి చెల్లించనున్నారు. దేవదాయ శాఖ 1987 (సెక్షన్-30)లోని 70వ సెక్షన్‌‌ను అనుసరించి అర్చకులకు చెల్లించే కనీస వేతనాన్ని దేవదాయ శాఖ భరించనుంది.

Advertisement

Next Story

Most Viewed