- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt.: దివ్యాంగులకు భారీ గుడ్ న్యూస్.. మంత్రి బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం (State Government) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వారికి వచ్చే పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిన సర్కార్.. తాజాగా వారి సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలోనే అర్హులైన వారందరికీ స్కూటీలను పంపిణీ చేయనుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya Swamy) ప్రకటించారు.
రాష్ట్ర జనాభాలో 2.23 శాతం మంది దివ్యాంగులు ఉన్నారని.. వారి హక్కులను కాపాడడంతో పాటు వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో దివ్యాంగులు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో దివ్యాంగుల పాఠశాలలు, వసతి గృహాల్లో సకల సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నం (Vishakhapatnam) కేంద్రంగా దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ (Sports Center)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.