‘మణిపూర్‌లో తెలుగు విద్యార్థులను కాపాడడంలో ఏపీ ప్రభుత్వం విఫలం’

by samatah |
‘మణిపూర్‌లో తెలుగు విద్యార్థులను కాపాడడంలో ఏపీ ప్రభుత్వం విఫలం’
X

దిశ, డైనమిక్ బ్యూరో : మణిపూర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడటంలో లేదు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది అని చెప్పుకొచ్చారు. వైసీపీ మాత్రం అవినీతి సంపాదన, అక్రమ కేసులే ప్రధాన అజెండాగా మలుచుకుంది అని విమర్శించారు. తెలుగు విద్యార్థుల సమస్యలు మీకు పట్టవా? రంగులు వేయటం కోసం, పార్టీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు గాని ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోరా? అని నిలదీశారు. ప్రత్యేక విమానాల్లో తిరిగే ముఖ్యమంత్రి మణిపాల్‌లో ఉన్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు

మణిపూర్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్న ఘటనపై అత్యవసర హెల్ప్ లైన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అల్లర్లలో చిక్కుకున్న వారిని సహాయం అందిస్తామని ప్రకటించింది. 011-23384016, 011-23387089 హెల్ప్ లైన్​లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది. మణిపూర్‌లో ఉన్న ఏపీ వాసుల సహాయం కోసం అక్కడి ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed