మద్యం, బెల్ట్ షాపులపై ప్రభుత్వం సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం చేస్తూ ఉత్తర్వులు

by srinivas |   ( Updated:2024-12-02 12:37:25.0  )
మద్యం, బెల్ట్ షాపులపై ప్రభుత్వం సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం చేస్తూ ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ(New Liquor Policy)ని అమల్లోకి తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టింది. కొత్త బ్రాండ్లను విక్రయించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. మద్యం అమ్మకాలను ప్రైవేటుకు అప్పగించింది. లాటర్ విధానంలో లైసెన్సులను కేటాయించింది. 2014-2019 హయాంలో మాదిరిగానే రాష్ట్రంలో ఆయా బ్రాండ్లనే అమల్లోకి తీసుకుంది. దీంతో మద్యం బాబులు పండగ చేసుకున్నారు. ధరలు కూడా తగ్గడంతో ఎక్కువ సేలింగ్ జరిగి ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది.


అయితే కొన్ని ప్రాంతాల్లో మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని. ఇక బెల్ట్ షాపులైతే విచ్చలవిడిగా వెలిశాయనే విమర్శలు విపరీతంగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మద్యం షాపుల్లో ఎమ్మార్పీని ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రెండో సారి కూడా ఉల్లంఘన జరిగే లైసెన్సు రద్దు చేస్తామని వెల్లడించింది. ఇక బెల్డ్ షాపుల విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. బెల్ట్ షాపులకు మద్యం ఇవ్వొద్దని ఆదేశించింది. ఇస్తే రూ. 5 లక్షల ఫైన్ వేస్తామని హెచ్చరించింది. రెండోసారి కూడా అలానే చేస్తే వైన్ షాపు లైసెన్సు రద్దు చేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.



Advertisement

Next Story

Most Viewed