గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం.. పేదలకు భారీ గుడ్ న్యూస్

by srinivas |   ( Updated:2024-07-29 15:12:55.0  )
గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం.. పేదలకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: పేదల ఇళ్ల స్థలాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు హౌసింగ్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని సమీక్షలో చర్చించారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మధ్యతరగతి ప్రజల ఇళ్లకు సంబంధించి సమీక్షలో చర్చించారు. మధ్యతరగతి పేదలకు ఎంఐజీ లే అవుట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులకు సైతం శుభవార్త చెప్పాలని నిర్ణయించుకున్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

కాగా గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సెంటు స్థలం పంపిణీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించింది. అయితే సెంటు స్థలంలో ఇళ్లు అగ్గిపెట్టెల్లా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు కనీసం రెండు సెంట్ల స్థలం అయినా పంపిణీ చేయాలని అప్పట్లో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హౌసింగ్ శాఖపై సమీక్ష నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed