- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలవరం పెండింగ్.. కేంద్రంపై నెట్టేసిన సజ్జల
దిశ, వెబ్ డెస్క్: పోలవరంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ స్పందించారు. అవినీతి కోసమే పోలవరాన్ని ఆలస్యం చేశారన్న కామెంట్స్‌కు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పోలవరం పూర్తి కాకపోవడానికి కేంద్రమే కారణమని చెప్పారు. కేంద్రం నిధులు సమయానికి ఇవ్వలేదని, అందుకే ఆలస్యమైందని తెలిపారు. కరెక్ట్‌గా నిధులు ఇచ్చి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తి అయి ఉండేదన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వలేదని చెప్పారు. పోలవరంపై చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టునే ధర్మవరం సభలో అమిత్ షా చదివారని సెటైర్లు వేశారు. 2014లో అవినీతి జరిగిందని, అందులో బీజేపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వ అవినీతిని ప్రజలు ఛీకొట్టారని విమర్శించారు. అయినా ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం నిధులను గత ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ చెప్పిన విషయం నిజమో కాదో అమిత్ షా చెప్పాలని సజ్జల ప్రశ్నించారు.
Read More..
AP News:కాంగ్రెస్‌కు "గుడ్ బై"..ఆ పార్టీలో చేరిన సీనియర్ నేత