Breaking: తుంగభద్ర డ్యామ్ తాత్కాలిక గేట్ల ఏర్పాటుకు ఏపీ నిధులు

by srinivas |
Breaking: తుంగభద్ర డ్యామ్ తాత్కాలిక గేట్ల ఏర్పాటుకు ఏపీ నిధులు
X

దిశ, వెబ్ డెస్క్: తుంగభద్ర డ్యామ్ 19వ గేటు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో తుంగభద్ర నుంచి సుంకేశులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి తుంగభద్ర డ్యామ్‌ను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిందని, దాంతో 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోందని చెప్పారు. 19వ గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు మరికొన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.


తుంగభద్ర డ్యామ్ పరిస్థితిపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పర్యవేక్షించారని కాల్వ పేర్కొన్నారు. నీరు నిలుపుదలకు అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కనీసం 64 టీఎంసీల నీటిని అయినా నిలుపుల చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. తాత్కాలికంగా గేట్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. వృథాగా నీరు పోకుండా త్వరగా కట్టడి చర్యలు చేపట్టాలన్నారు. గేటు కూలిపోవడంలో మానవ తప్పిదం ఉంటే కఠిన శిక్షలు అమలు చేయాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story