- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజకీయాల్లో రాజీపడొద్దని నాకు సూచించారు.. రామోజీరావుపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో రాజీపడొద్దని రామోజీరావు తనకుకు సూచించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడ కానూరులో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రామోజీరావు పత్రిక రంగాన్ని విస్తరించడమే కాకుండా స్టూడియో, సినిమా రంగంలోనూ రాణించారని గుర్తు చేశారు. రామోజీరావు జర్నలిజం స్పూర్తిదాయకమని చెప్పారు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా రామోజీరావు వెనక్కి తగ్గలేదని తెలిపారు. కుటుంబ సభ్యులను బెదిరించినా రామోజీరావు జర్నలిజం విలువలను కాపాడారని పేర్కొన్నారు. రామోజీరావు సాహసోపేతమైన జర్నలిజం చేశారన్నారు. గత ప్రభుత్వం రామోజీరావును వేధించిందని, ఏపీ ఎన్నికల ఫలితాల వార్తను వినే పరమవదించారని చెప్పారు. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని, రామోజీరావు జర్నలిస్టు వారసత్వ ప్రవాహాన్ని కొనసాగించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.