- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన అధిష్టానం.. వారు ఎవరంటే?
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీ అధినేతలు ఇప్పటికే తమ మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు మొదలు పెట్టాయి. ప్రజలకు ఖచ్చితమైన హామీలు ఇచ్చి నేరవేర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్టానికి సంబంధించి ప్రజారంజక మేనిఫెస్టోను రూపకల్పనకు ఏఐసీసీ కమిటీని ప్రకటించింది. మొత్తం 11 మంది సభ్యులకు కమిటీలో చోటు కల్పించారు. చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి పల్లింరాజు, సభ్యులుగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి, శ్రీమతి కమలమ్మ, జంగా గౌతమ్, ఉషా నాయుడు, నజీరుద్దీన్, కొరివి వినయ్ కుమార్, డాక్టర్ గంగాధర్, కారుమంచి రమాదేవిలను నియమించారు. ఇప్పటికే ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ వచ్చింది. ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుస ప్రెస్ మీట్లు పెడుతూ.. ఎన్నికల రణరంగంలోకి కాంగ్రెస్ పార్టీ కూడా దిగిదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
Read More..