రేషన్ తూకంలో అక్రమాలు... మంత్రి నాదెండ్ల సీరియస్

by srinivas |
రేషన్ తూకంలో అక్రమాలు... మంత్రి నాదెండ్ల సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీసుకున్న బాధ్యతలను ఫర్‌ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. ఇలా బాధ్యతలు తీసుకున్నారో లేదో వెంటనే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ అక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టేశారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. గొల్లపూడి మండల లెవల్ స్టాక్ పాయింట్‌లో సమాచారం ఇవ్వకుండా వెళ్లి రేషన్ సరుకులను పరిశీలించారు. అయితే రేషన్ సరుకుల తూకంలో తగ్గుదలను ఆయన గమనించారు. వెంటనే అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచదార, కందిపప్పు, నూనె ప్యాకెట్ల బరువు ఎందుకు తక్కువగా ఉందని మండిపడ్డారు. సరుకుల్లో నాణ్యతాలోపాన్ని సైతం గుర్తించి సిబ్బందికి చివాట్లు పెట్టారు. వెంటనే సరుకులను వెనక్కి పంపాలని, ప్యాకింగ్ చేసే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ తూకంలో అక్రమాలపై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed