- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth Reddy: నేడు సాయంత్రం కేరళకు సీఎం రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ సాయంత్రం కేరళ (kerala) కు వెళ్లనున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, పార్టీ నేతలు సైతం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం అక్కడ జరగబోయే ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కూతురి (AICC Secretary Srinivasan) రిసెప్షన్ కు వీరంతా హాజరుకానున్నారు. అనంతరం రేపు వాయనాడ్ (Wayanad) లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తరపున నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో సీఎం పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ స్థానానికి బై పోల్ జరుగుతున్నది. ఈ నెల 13న జరబోయే ఎలక్షన్ కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు సైతం ముగిసింది. బై ఎలక్షన్ లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు ప్రధాన రాజకీయ ఫ్రంట్‌ల అభ్యర్థులు ప్రియాంక గాంధీ (కాంగ్రెస్), సత్యన్ మొకేరి (సీపీఐ), నవ్య హరిదాస్ (బీజేపీ) - ఐదు చిన్న పార్టీల అభ్యర్థులు, ఎనిమిది మంది స్వతంత్రులు కూడా వాయాండ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఇటీవల ఎల్‌డిఎఫ్‌లోకి మారిన డాక్టర్ సరిన్‌కు స్టెతస్కోప్ గుర్తును కేటాయించారు.