AP : రాజధాని పనులు ప్రారంభం.. దుర్గ గుడికి మహిళా రైతుల పాదయాత్ర

by Rajesh |
AP : రాజధాని పనులు ప్రారంభం.. దుర్గ గుడికి మహిళా రైతుల పాదయాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అమరావతి పనులు ప్రారంభం కావడంతో మహిళా రైతులు పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శిబిరం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు మహిళారైతులు పాదయాత్రగా బయల్దేరారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మీడియాతో మాట్లాడారు. అమరావతే ఏకైక రాజధాని అని రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఐదేళ్లుగా అనేక బాధలు పడ్డామని.. గతంలో పాదయాత్ర అంటే చాలు పోలీసులు అడ్డుకునేవారని గుర్తు చేసుకున్నారు. గతంలో తమపై పలుసార్లు దాడి చేశారని.. లాఠీఛార్జ్ చేశారని తెలిపారు. పచ్చ కండువా ఉంటే దుర్గమ్మ గుడి వద్ద కూడా పోలీసులు అడ్డుకునేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి ఊపిరి పీల్చుకుందన్నారు. 29 గ్రామాల నుంచి పాదయాత్రగా దుర్గమ్మ గుడికి వెళ్తున్నామని.. దుర్గమ్మ దయ వల్లే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నారు.

Advertisement

Next Story