నేడు ఏపీ కేబినెట్ సమావేశం

by Javid Pasha |   ( Updated:2023-11-03 06:18:24.0  )
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఏపీ కేబినెట్ భేటీ గత వారంలోనే జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ రోజుకి వాయిదా పడింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. చంద్రబాబుపై వరుస కేసులు, బెయిల్‌పై బయటకొచ్చిన నేపథ్యంలో కేబినెట్ భేటీ కీలకంగా మారింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story