- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకూ జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కేబినెట్ లో చర్చించిన కీలక అంశాలను వివరించనున్నారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో ఉచిత ఇసుక, రేషన్, అమరావతి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinders) పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రేషన్ డీలర్ల నియామకం, కొత్తరేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, పోలవరం పనులు, దేవాలయాల పాలకమండళ్ల సంఖ్య పెంపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా వివరాలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వివరించనున్నారు.