- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ!
దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ మీటింగ్ (Cabinet Meeting)కు ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi) సచివాలయంలోని బ్లాక్-1లో నేడు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan)తో పాటు మంత్రులు (Ministers), ప్రభుత్వ సలహాదారులు (Government Advisers) హాజరుకానున్నారు. ఈ సమావేశంలో భాగంగా సీఆర్‌డీఏ (CRDA) ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానానికి సమయం కుదింపు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారాల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు బదిలీపై చర్చ జరగనుంది. ఐటీతో పాటు మరికొన్ని పాలసీలు గురించి సంక్షిప్తంగా చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలపై చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలుపనుంది.
విశాఖలో రూ.11,498 కోట్లతో తొలిదశలో 46.23 కి.మీ., విజయవాడలో రూ.11,009 కోట్లతో 38.4 కి.మీ. మేర మెట్రోకు ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్‌లను మెట్రో రైల్ కార్పొరేషన్ పంపింది. ఈ క్రమంలో విశాఖ, విజయవాడ మెట్రో రైల్ డీపీఆర్‌లకు ఆమోదం తెలుపనున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ పోర్ట్ (Kakinada Port) అంశంపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపై కూడా భేటీలో డిస్కస్ చేయనున్నారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా వేధింపులపై కేసులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నాయి.