Pushpa-2 : పుష్ప-2 సినిమాను అడ్డుకుంటాం : జనసేన నేత రమేష్ బాబు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-04 16:20:28.0  )
Pushpa-2 : పుష్ప-2 సినిమాను అడ్డుకుంటాం : జనసేన నేత రమేష్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ (Allu Arjun) మెగా ఫ్యామిలీ(Mega Family)కి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2(Pushpa-2)సినిమాను ఆంధ్రప్రదేశ్ లో అడ్డుకుంటామని జనసేన(Janasena) గన్నవరం నియోజకవర్గం నేత చలమలశెట్టి రమేష్ బాబు (Chalamalasetti Ramesh Babu) హెచ్చరించారు. హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ప్రస్తావన చేయకపోవడంతో జనసేన నేతలు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో చలమలశెట్టి రమేష్ చేసిన హెచ్చరికలు మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య మరింత మంటలు రాజేసేలా ఉన్నాయి.

మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుందని, నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావని రమేష్ బాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ పోకడ మెగా ఫ్యామిలీని, పవన్ కల్యాణ్ ను అభిమానించే జనసేన శ్రేణులను ఆగ్రహానికి గురి చేస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి పవన్ కల్యాణ్ వైసీపీని ఎదుర్కొంటే అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలికి వ్యతిరేకంగా వైసీపీ తరుపున ప్రచారం చేశారని గుర్తు చేశారు. అల్లు అర్జున్ కు గతంలోనే తాము అల్టిమేటం ఇచ్చామని, కానీ ఆయన పోకడ మెగా ఫ్యామిలీకి, జనసైనికులకు చాలా బాధ కలిగించిందని రమేశ్ బాబు తెలిపారు. తొలి నుంచి మెగా ఫ్యామిలీ అభిమాని అని, తాను అక్కడే పెరిగానని, చిరంజీవి అడుగు జాడల్లో నడుస్తానని చెప్పి ఇప్పుడు వారి ప్రస్తావన చేయకపోవడం సరికాదన్నారు. మెగా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తాము సైలెంట్ గా ఉండలేమని, ఇప్పటికైనా చిరంజీవి పట్ల అల్లు అర్జున్ తన పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. చిరంజీవికి, పవన్ కల్యాణ్ కు, నాగబాబుకు క్షమాపణలు చెప్పి, చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోకపోతే పుష్ప 2 సినిమా విడుదలను ఆంధ్రప్రదేశ్ లో అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

Read More...

RGV: పుష్ప 2 ఇడ్లీలు.. టికెట్ ధరల పెంపుపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్


Advertisement

Next Story