AP బడ్జెట్..అసెంబ్లీ నుంచి టీడీపీ సస్పెన్షన్..

by Mahesh |
AP బడ్జెట్..అసెంబ్లీ నుంచి టీడీపీ సస్పెన్షన్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే బడ్జెట్‌ను అడ్డుకొవడం సరికాదని.. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోవాలని సూచించారు. అయినా సరే పదే పదే మంత్రి ప్రసంగానికి అడ్డు పడుతుండటంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story